మీ Android పరికరంలో లొకేషన్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి

 

రాబోయే నెలల్లో, లొకేషన్ హిస్టరీ సెట్టింగ్ పేరు టైమ్‌లైన్‌కు మారుతుంది. మీ ఖాతాకు లొకేషన్ హిస్టరీ ఆన్ అయ్యి ఉంటే, మీ యాప్, ఖాతా సెట్టింగ్‌లలో టైమ్‌లైన్‌ను కనుగొనవచ్చు. మరింత తెలుసుకోండి.
మీరు సెట్టింగ్‌లలో లొకేషన్‌ను ఆన్ చేసినప్పుడు, లొకేషన్ ఆధారిత సర్వీస్‌లను మీరు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీ ఫోన్ లొకేషన్ ఆధారంగా రోజువారీ ప్రయాణ సూచనలు, సమీపంలోని రెస్టారెంట్‌లు వంటి మెరుగైన లోకల్ సెర్చ్ ఫలితాలను పొందవచ్చు.

ముఖ్యమైనది:

మీ ఫోన్‌లో అందుబాటులో ఉన్న లొకేషన్ సెట్టింగ్‌ల గురించి తెలుసుకోండి

ముఖ్య గమనిక: మీరు మీ ఫోన్‌లో లొకేషన్‌ను ఆఫ్ చేసినప్పుడు, యాప్‌లు, సర్వీస్‌లు మీ ఫోన్ లొకేషన్‌ను పొందలేవు. మీ IP అడ్రస్ ఆధారంగా మీరు ఇప్పటికీ లోకల్ ఫలితాలను, యాడ్‌లను పొందవచ్చు.

Google లొకేషన్ ఆధారిత సర్వీస్‌లను అందిస్తోంది, అందులో ఇవి కూడా ఉన్నాయి:

చిట్కా: యాప్‌లకు వాటి స్వంత సెట్టింగ్‌లు ఉంటాయి. యాప్ లొకేషన్ సెట్టింగ్‌లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

మీ ఫోన్ లొకేషన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. స్క్రీన్ పై భాగం నుండి కిందికి స్వైప్ చేయండి.
  2. లొకేషన్ ను నొక్కి, పట్టుకోండి.
    • మీకు లొకేషన్ కనిపించకపోతే:
      1. 'ఎడిట్ చేయండి సవరించండి లేదా సెట్టింగ్‌లు 'ను ట్యాప్ చేయండి.
      2. లొకేషన్ ను మీ క్విక్ సెట్టింగ్‌లలోకి లాగండి.

 

లొకేషన్ ఆన్‌లో ఉన్నప్పుడు
లొకేషన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు

మీ ఫోన్ మరింత ఖచ్చితమైన లొకేషన్‌ను పొందడంలో సహాయపడండి (Google లొకేషన్ సర్వీస్‌లు, అంటే Google లొకేషన్ ఖచ్చితత్వం)

మీ ఫోన్ లొకేషన్ ఖచ్చితత్వాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయండి

Android 12 & అంతకన్నా కొత్త వెర్షన్

  1. స్క్రీన్ పై భాగం నుండి కిందికి స్వైప్ చేయండి.
  2. లొకేషన్ ను నొక్కి, పట్టుకోండి.
    • మీకు లొకేషన్ కనిపించకపోతే:
      1. 'ఎడిట్ చేయండి సవరించండి లేదా సెట్టింగ్‌లు 'ను ట్యాప్ చేయండి.
      2. లొకేషన్ ను మీ క్విక్ సెట్టింగ్‌లలోకి లాగండి.
  3. 'లొకేషన్ సర్వీస్‌లు ఆ తర్వాత Google లొకేషన్ ఖచ్చితత్వం'ను ట్యాప్ చేయండి.
  4. 'లొకేషన్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచండిని' ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Android 11 & అంతకంటే పాత వెర్షన్

  1. స్క్రీన్ పై భాగం నుండి కిందికి స్వైప్ చేయండి. 
  2. లొకేషన్ ను నొక్కి, పట్టుకోండి.
    • మీకు లొకేషన్ కనిపించకపోతే:
      1. 'ఎడిట్ చేయండి సవరించండి లేదా సెట్టింగ్‌లు 'ను ట్యాప్ చేయండి.
      2. లొకేషన్ ను మీ క్విక్ సెట్టింగ్‌లలోకి లాగండి.
  3. 'అధునాతన ఆ తర్వాతGoogle లొకేషన్ ఖచ్చితత్వం'ను ట్యాప్ చేయండి. 
  4. 'లొకేషన్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచండి'ని ఆన్ లేదా ఆఫ్ చేయండి.
Google లొకేషన్ ఖచ్చితత్వం ఆన్‌లో ఉన్నప్పుడు

మీరు Google లొకేషన్ ఖచ్చితత్వాన్ని ఆన్ చేసినప్పుడు, మరింత ఖచ్చితమైన లొకేషన్‌ను పొందడానికి మీ ఫోన్ ఈ సోర్స్‌లను ఉపయోగిస్తుంది:

  • GPS
  • Wi-Fi
  • మొబైల్ నెట్‌వర్క్‌లు
  • సెన్సార్‌లు (యాక్సిలెరోమీటర్ వంటివి)

కాలానుగుణంగా లొకేషన్ డేటాను Google సేకరించవచ్చు, అలాగే లొకేషన్ ఖచ్చితత్వాన్ని, లొకేషన్ ఆధారిత సర్వీస్‌లను మెరుగుపరచడానికి ఈ డేటాను అనామక మార్గంలో ఉపయోగించవచ్చు.

Google లొకేషన్ ఖచ్చితత్వం ఆఫ్‌లో ఉన్నప్పుడు

మీరు Google లొకేషన్ ఖచ్చితత్వాన్ని ఆఫ్ చేసినప్పుడు, మీ ఫోన్, లొకేషన్‌ను గుర్తించడానికి GPS అలాగే యాక్సిలెరోమీటర్ వంటి సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. ఇతర సోర్స్‌ల కంటే GPS నెమ్మదిగా, తక్కువ ఖచ్చితమైనదిగా ఉండవచ్చు.

Google లొకేషన్ ఖచ్చితత్వం ఆఫ్‌లో ఉన్నప్పుడు, GPS, Wi-Fi, నెట్‌వర్క్ అలాగే సెన్సార్ డేటాను 'Google లొకేషన్ ఖచ్చితత్వం' ఉపయోగించదు, సేకరించదు.

Android 12 అంతకన్నా కొత్త వెర్షన్ కోసం, ఖచ్చితమైన లొకేషన్‌ను యాక్సెస్ చేయడానికి మీరు ప్రతి యాప్ అనుమతిని మేనేజ్ చేయవచ్చు. ఇది Google లొకేషన్ ఖచ్చితత్వానికి భిన్నంగా ఉంటుంది, ఇది మీ పరికరంలో ఉండే ఒక లొకేషన్ సెట్టింగ్, అత్యంత ఖచ్చితమైన లొకేషన్ కోసం మరిన్ని సోర్స్‌లను ఉపయోగించడానికి ఈ సెట్టింగ్ మీ ఫోన్‌ను అనుమతిస్తుంది.  Google లొకేషన్ ఖచ్చితత్వం ఆన్‌లో ఉన్నప్పటికీ, మీరు ఏదైనా యాప్‌నకు మీ పరికరం ఉన్న ఖచ్చితమైన లొకేషన్‌కు యాక్సెస్‌ను అనుమతించకూడదనుకుంటే, మీరు ఆ యాప్‌నకు, సుమారుగా ఉన్న లొకేషన్ అనుమతులను మాత్రమే మంజూరు చేయవచ్చు.  మీరు Google లొకేషన్ ఖచ్చితత్వాన్ని ఆఫ్ చేస్తే, యాప్‌లు మీ పరికరం ఉన్న ఖచ్చితమైన లొకేషన్‌ను పొందలేకపోవచ్చు. యాప్ లొకేషన్ అనుమతులను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

Wi-Fi & Bluetooth స్కానింగ్‌ను సెటప్ చేయండి

మెరుగైన లొకేషన్ సమాచారాన్ని పొందడంలో యాప్‌లకు సహాయపడటానికి, మీరు మీ ఫోన్‌ను సమీపంలోని Wi-Fi యాక్సెస్ పాయింట్‌లు లేదా బ్లూటూత్ పరికరాలను స్కాన్ చేయడానికి అనుమతించవచ్చు.

Android 12 & అంతకన్నా కొత్త వెర్షన్

  1. స్క్రీన్ పై భాగం నుండి కిందికి స్వైప్ చేయండి.
  2. లొకేషన్ ను నొక్కి, పట్టుకోండి.
    • మీకు లొకేషన్ కనిపించకపోతే:
      1. 'ఎడిట్ చేయండి సవరించండి లేదా సెట్టింగ్‌లు 'ను ట్యాప్ చేయండి.
      2. లొకేషన్ ను మీ క్విక్ సెట్టింగ్‌లలోకి లాగండి.
  3. 'లొకేషన్ సర్వీస్‌లను' ట్యాప్ చేయండి.
  4. Wi‑Fi స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Android 11 & అంతకంటే పాత వెర్షన్‌లు

  1. స్క్రీన్ పై భాగం నుండి కిందికి స్వైప్ చేయండి. 
  2. లొకేషన్ ను నొక్కి, పట్టుకోండి.
    • మీకు లొకేషన్ కనిపించకపోతే:
      1. 'ఎడిట్ చేయండి సవరించండి లేదా సెట్టింగ్‌లు 'ను ట్యాప్ చేయండి. 
      2. లొకేషన్ ను మీ క్విక్ సెట్టింగ్‌లలోకి లాగండి.
  3. Wi‑Fi స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్‌ను ట్యాప్ చేయండి. 
  4. Wi‑Fi స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మీ లొకేషన్‌ను పంపండి

మిమ్మల్ని త్వరగా కనుగొనడంలో ఎమర్జెన్సీ సిబ్బందికి సహాయపడటానికి, మీరు ఎమర్జెన్సీ నంబర్‌కు డయల్ చేసినప్పుడు లేదా SMS పంపినప్పుడు మీ ఫోన్ లొకేషన్ పంపబడవచ్చు, ఉదాహరణకు మీరు USలో 911కి, లేదా యూరప్‌లో 112కు డయల్ చేసినప్పుడు.

Android ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ (ELS) మీ దేశంలో లేదా ప్రాంతంలో, అలాగే మీ మొబైల్ నెట్‌వర్క్‌లో పని చేస్తూ ఉండి, మీరు ELSను ఆఫ్ చేయకుంటే, మీ ఫోన్ ఆటోమేటిక్‌గా ELS ద్వారా ఎమర్జెన్సీ సహాయక సిబ్బందికి దాని లొకేషన్‌ను పంపుతుంది. ELS ఆఫ్‌లో ఉన్నప్పటికీ, ఎమర్జెన్సీ కాల్ లేదా SMSను పంపే సమయంలో మీ మొబైల్ క్యారియర్ పరికర లొకేషన్‌ను పంపవచ్చు.

Android ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

మీరు ఎప్పుడైనా ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. Google Play సర్వీసులతో చాలా పరికరాలలో ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ అందుబాటులో ఉంది.

Android 12 & అంతకన్నా కొత్త వెర్షన్

  1. మీ పరికరంలోని సెట్టింగ్‌ల యాప్‌ను తెరవడానికి, మీ స్క్రీన్ పై నుండి రెండుసార్లు కిందికి స్వైప్ చేయండి.
  2. 'సెట్టింగ్‌లు  ఆ తర్వాత భద్రత & ఎమర్జెన్సీ' ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Android 11 & అంతకంటే పాత వెర్షన్‌లు

  1. స్క్రీన్ పై భాగం నుండి కిందికి స్వైప్ చేయండి.
  2. లొకేషన్ ను నొక్కి, పట్టుకోండి.
    • మీకు లొకేషన్ కనిపించకపోతే:
      1. 'ఎడిట్ చేయండి సవరించండి లేదా సెట్టింగ్‌లు 'ను ట్యాప్ చేయండి.
      2. లొకేషన్ ను మీ క్విక్ సెట్టింగ్‌లలోకి లాగండి.
  3. 'అధునాతన ఆ తర్వాత ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్' ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
 

ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ ఎలా పని చేస్తుంది

మీరు లోకల్ ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసినప్పుడు లేదా SMS పంపినప్పుడు మాత్రమే ELS యాక్టివేట్ అవుతుంది.

మీ ఎమర్జెన్సీ కాల్ సమయంలో, పరికరానికి సంబంధించి సాధ్యమైనంత వరకు అత్యంత ఖచ్చితమైన లొకేషన్‌ను పొందడానికి, 'Google లొకేషన్ ఖచ్చితత్వం' అలాగే ఇతర సమాచారాన్ని ELS ఉపయోగించవచ్చు. మీ పరికర Wi-Fi సెట్టింగ్‌లు ఆఫ్‌లో ఉంటే, ELS దానిని ఆన్ చేయవచ్చు.

మిమ్మల్ని గుర్తించడంలో ఎమర్జెన్సీ సర్వీసులకు సహాయపడే ఉద్దేశంతో, ప్రామాణీకరించబడిన ఎమర్జెన్సీ పార్టనర్‌లకు మీ ఫోన్ దాని లొకేషన్‌ను పంపుతుంది. మీ లొకేషన్ మీ ఫోన్ నుండి నేరుగా ఎమర్జెన్సీ పార్టనర్‌లకు పంపబడుతుంది.

ELS యాక్టివ్‌గా ఉన్న సమయంలో, ఎమర్జెన్సీ కాల్ లేదా SMS పూర్తయిన తర్వాత, ELS ఎంత బాగా పని చేస్తోందో విశ్లేషించడానికి, గుర్తించబడిన వినియోగ అలాగే ఎనలిటిక్స్ డేటాను మీ ఫోన్ Googleకు పంపవచ్చు. ప్రామాణీకరించబడిన ఎమర్జెన్సీ పార్టనర్‌లకు పంపిన లొకేషన్ ఈ సమాచారంలో ఉండదు అలాగే ఇది మిమ్మల్ని గుర్తించదు.

చిట్కా: ప్రామాణీకరించబడిన ఎమర్జెన్సీ పార్టనర్‌లకు ELS మీ లొకేషన్‌ను పంపినప్పుడు, ఇది మీరు Google Maps ద్వారా లొకేషన్‌ను షేర్ చేసే దాని కంటే భిన్నంగా ఉంటుంది. Google Maps ద్వారా లొకేషన్ షేరింగ్ గురించి తెలుసుకోండి.

మీరు Android పాత వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే

లొకేషన్ సెట్టింగ్‌లను ఎంచుకోండి (Android 9.0)

లొకేషన్ సెట్టింగ్‌లను మార్చడానికి ఇలా చేయండి: 

  1. మీ పరికరంలో సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. 'సెక్యూరిటీ & లొకేషన్ ఆ తర్వాత లొకేషన్‌ను' ట్యాప్ చేయండి.
    • మీరు వర్క్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటే, 'అధునాతన' ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఆ తర్వాత, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:

  • లొకేషన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి: లొకేషన్‌ను ట్యాప్ చేయండి.
  • సమీపంలోని నెట్‌వర్క్‌ల కోసం స్కాన్ చేయండి: 'అధునాతన ఆ తర్వాతస్కానింగ్‌ను' ట్యాప్ చేయండి. Wi-Fi స్కానింగ్ లేదా బ్లూటూత్ స్కానింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
  • ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి:  'అధునాతన ఆ తర్వాతGoogle ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను' ట్యాప్ చేయండి. ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి. 
లొకేషన్ మోడ్‌ను ఎంచుకోండి (Android 4.4—8.1)
  1. మీ ఫోన్‌లో సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. 'సెక్యూరిటీ & లొకేషన్ ఆ తర్వాత లొకేషన్‌ను' ట్యాప్ చేయండి.
    • "సెక్యూరిటీ & లొకేషన్" అనేది కనిపించకపోతే, 'లొకేషన్'ను ట్యాప్ చేయండి.
  3. 'మోడ్‌ను' ట్యాప్ చేయండి.
  4. మోడ్‌ను ఎంచుకోండి:
    • అధిక నిర్థిష్టత: సాధ్యమైనంత ఖచ్చితమైన లొకేషన్‌ను పొందడానికి, GPS, Wi-Fi, మొబైల్ నెట్‌వర్క్‌లు, సెన్సార్‌లను ఉపయోగించండి. మీ ఫోన్ లొకేషన్‌ను వేగంగా, అలాగే మరింత ఖచ్చితంగా అంచనా వేయడంలో సహాయపడటానికి Google లొకేషన్ సర్వీస్‌లను ఉపయోగించండి.
    • బ్యాటరీ ఆదా: Wi-Fi, మొబైల్ నెట్‌వర్క్‌ల వంటి తక్కువ బ్యాటరీని వినియోగించే సోర్స్‌లను ఉపయోగించండి. మీ ఫోన్ లొకేషన్‌ను వేగంగా, అలాగే మరింత ఖచ్చితంగా అంచనా వేయడంలో సహాయపడటానికి Google లొకేషన్ సర్వీస్‌లను ఉపయోగించండి.
    • పరికరం మాత్రమే: GPSను, సెన్సార్‌లను ఉపయోగించండి. లొకేషన్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి Google లొకేషన్ సర్వీస్‌లను ఉపయోగించవద్దు. ఇది మీ ఫోన్ లొకేషన్‌ను మరింత నెమ్మదిగా అంచనా వేసి, ఎక్కువ బ్యాటరీని వినియోగించగలదు.
లొకేషన్ యాక్సెస్‌ను ఎంచుకోండి (Android 4.1—4.3)

మీ ఫోన్ ఎటువంటి లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు అనేది మీరు కంట్రోల్ చేయవచ్చు.

  1. మీ ఫోన్‌లో సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. "వ్యక్తిగతం" కింద, 'లొకేషన్ యాక్సెస్‌ను' ట్యాప్ చేయండి.
  3. స్క్రీన్ పై భాగంలో, నా లొకేషన్‌కు యాక్సెస్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
    • లొకేషన్ యాక్సెస్ ఆన్ చేసి ఉన్నప్పుడు, వీటిలో ఒక దాన్ని లేదా రెండింటినీ ఎంచుకోండి:
      • GPS ఉపగ్రహాలు: కారులో ఉండే GPS పరికరం వంటి ఉపగ్రహ సిగ్నల్‌ల నుండి మీ ఫోన్ దాని లొకేషన్‌ను అంచనా వేయడానికి అనుమతిస్తుంది.
      • Wi-Fi & మొబైల్ నెట్‌వర్క్ లొకేషన్: GPSను ఉపయోగించి లేదా GPSను ఉపయోగించకుండా మీ ఫోన్ దాని లొకేషన్‌ను వేగంగా అంచనా వేయడంలో సహాయపడటానికి Google లొకేషన్ సర్వీస్‌లను ఉపయోగించుకునేలా చేస్తుంది.
    • లొకేషన్ యాక్సెస్ ఆఫ్‌లో ఉన్నప్పుడు:
      మీ ఫోన్ దాని ఖచ్చితమైన లొకేషన్‌ను కనుగొనలేదు లేదా ఏ యాప్‌లతోనూ షేర్ చేయలేదు.

చిట్కా: ఒకే టాబ్లెట్‌ను పలు వ్యక్తులు ఉపయోగిస్తున్నట్లయితే, ప్రతి వ్యక్తి వేర్వేరు లొకేషన్ యాక్సెస్ సెట్టింగ్‌లను కలిగి ఉండవచ్చు.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
11577725708537395696
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false
  翻译: