మీ వెబ్ & యాప్ యాక్టివిటీని కనుగొని, కంట్రోల్ చేయండి

వెబ్ & యాప్ యాక్టివిటీ అనేది మీ Google ఖాతాలో ఇతర Google సర్వీస్‌ల నుండి మీకు సంబంధించిన సెర్చ్‌లను, యాక్టివిటీని సేవ్ చేస్తుంది. మీరు కింద పేర్కొన్నటువంటి వ్యక్తిగతీకరించబడిన ఎక్స్‌పీరియన్స్‌లను పొందవచ్చు:

  • వేగవంతమైన సెర్చ్‌లు
  • మరింత సహాయకరమైన యాప్‌లు
  • కంటెంట్ సిఫార్సులు

మీరు ఎప్పుడైనా వెబ్ & యాప్ యాక్టివిటీని ఆఫ్ చేయవచ్చు లేదా గత యాక్టివిటీని తొలగించవచ్చు.

చిట్కా: మీరు మీ ఉపాధి సంస్థ లేదా విద్యా సంస్థ ద్వారా మీ Google ఖాతాను పొందినట్లయితే, మీ సంస్థ ఈ సర్వీస్‌ను ఉపయోగించడానికి, మీరు వెబ్ & యాప్ యాక్టివిటీని ఆన్ చేయమని మీ అడ్మినిస్ట్రేటర్‌ను అడగాల్సి రావచ్చు.

వెబ్ & యాప్ యాక్టివిటీని ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, యాక్టీవిటీ కంట్రోల్స్ పేజీకి వెళ్లండి. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయమని మిమ్మల్ని కోరవచ్చు.
  2. వెబ్ & యాప్ యాక్టివిటీని ఆన్ లేదా ఆఫ్ చేయండి.
  3. వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్‌లో ఉన్నప్పుడు:
    • మీరు "Chrome హిస్టరీ, Google సర్వీస్‌లను ఉపయోగించే సైట్‌లు, యాప్‌లు పరికరాల నుండి యాక్టివిటీని చేర్చండి" పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోవచ్చు.
    • మీరు "వాయిస్, ఆడియో యాక్టివిటీని చేర్చండి" పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోవచ్చు.
  4. మీరు వెబ్ & యాప్ యాక్టివిటీని ఆఫ్ చేసినప్పుడు:
    • ఆఫ్ చేయండిని ఎంచుకోండి, ఆపై ఆఫ్ చేయండి లేదా ఆఫ్ చేసి యాక్టివిటీని తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • మీరు యాక్టివిటీని ఆఫ్ చేసి, తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే, మీరు ఏ యాక్టివిటీని తొలగించాలనుకుంటున్నారో ఎంచుకుని, నిర్ధారించడానికి దశలను ఫాలో అవ్వండి.

చిట్కా: కొన్ని బ్రౌజర్‌లలో, పరికరాలలో ఈ యాక్టివిటీని సేవ్ చేసే విధానం మీద ప్రభావం చూపించే మరిన్ని సెట్టింగ్‌లు ఉండవచ్చు.

నా Google యాక్టివిటీలో వెబ్ & యాప్ యాక్టివిటీని కనుగొనండి లేదా తొలగించండి

మీరు నా Google యాక్టివిటీలో మీ వెబ్ & యాప్ యాక్టివిటీని కనుగొనవచ్చు, తొలగించవచ్చు. 

చిట్కా: మరింత సెక్యూరిటీని జోడించడానికి, మీకు నా యాక్టివిటీలో మీ పూర్తి హిస్టరీని చూడటానికి, ఒక అదనపు వెరిఫికేషన్ దశ అవసరం కావచ్చు.

 

వెబ్ & యాప్ యాక్టివిటీగా ఏవేవి సేవ్ అవుతాయి

మీ సెర్చ్‌లు & ఇతర యాక్టివిటీని గురించిన సమాచారం

వెబ్ & యాప్ యాక్టివిటీని ఆన్ చేసినప్పుడు, ఇలాంటి సమాచారాన్ని Google సేవ్ చేస్తుంది:

  • Maps, Play వంటి Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లలో సెర్చ్‌లు, యాక్టివిటీలు.
  • మీ భాష, రెఫర్ చేసినవారు, మీరు బ్రౌజర్‌ను ఉపయోగిస్తారా లేక యాప్‌ను ఉపయోగిస్తారా, లేదంటే మీరు ఎటువంటి పరికరాన్ని ఉపయోగిస్తారు వంటి మీ యాక్టివిటీకి అనుబంధంగా ఉండే సమాచారం.
  • మీ లొకేషన్, భాష, IP అడ్రస్, సిఫార్సు చేసినవారు, అలాగే మీరు ఉపయోగించేది బ్రౌజర్‌నా లేక యాప్‌నా అనే సమాచారం.
  • యాప్‌లు లేదా కాంటాక్ట్ పేర్ల కోసం ఇటీవల చేసిన సెర్చ్‌ల వంటి మీ పరికరంలోని సమాచారం.
  • Assistant ఇంటరాక్షన్‌లు; మీరు ఉద్దేశపూర్వకంగా చేయని యాక్టివేషన్‌ను Google Assistant గుర్తిస్తే అవి కూడా ఇందులో భాగంగా ఉంటాయి.

చిట్కా: మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ యాక్టివిటీని సేవ్ చేయవచ్చు.

Google సర్వీస్‌లను ఉపయోగించే సైట్‌లు, యాప్‌లు, ఇంకా పరికరాలలో మీ బ్రౌజింగ్, అలాగే ఇతర యాక్టివిటీ గురించిన సమాచారం

వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్‌లో ఉన్నప్పుడు, మీరు ఇటువంటి అదనపు యాక్టివిటీని చేర్చవచ్చు:

  • యాడ్‌లను చూపడం కోసం Googleతో పార్టనర్ అయిన సైట్‌లు, యాప్‌ల యాక్టివిటీ
  • Googleతో యాప్‌లు షేర్ చేసే డేటాతో సహా Google సర్వీస్‌లను ఉపయోగించే సైట్‌లు, యాప్‌ల యాక్టివిటీ
  • మీ Chrome బ్రౌజింగ్ హిస్టరీ
  • బ్యాటరీ స్థాయి, సిస్టమ్ ఎర్రర్‌లు వంటి Android వినియోగం & విశ్లేషణలు

ఈ సమాచారాన్ని సేవ్ చేయడం కోసం Googleను అనుమతించడానికి:

  • వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్ అయ్యి ఉండాలి.
  • "Google సర్వీస్‌లను ఉపయోగించే సైట్‌లు, యాప్‌లు, పరికరాల నుండి Chrome హిస్టరీ, యాక్టివిటీని చేర్చండి" పక్కన ఉన్న బాక్స్‌ను తప్పనిసరిగా ఎంచుకోవాలి.

మీరు Chromeకు సైన్ ఇన్ చేసి, మీ హిస్టరీని సింక్ చేస్తున్నట్లయితే మాత్రమే మీ Chrome హిస్టరీ సేవ్ అవుతుంది. Chromeకు సైన్ ఇన్ చేయడం గురించి తెలుసుకోండి.

గమనిక: మీరు షేర్ చేసిన పరికరాన్ని ఉపయోగిస్తుంటే లేదా ఒకటి కంటే ఎక్కువ ఖాతాలతో సైన్ ఇన్ చేస్తుంటే, మీరు ఉపయోగించే బ్రౌజర్ లేదా పరికరంలోని ఆటోమేటిక్ ఖాతాలో యాక్టివిటీ సేవ్ అయ్యే అవకాశం ఉంది.

ఆడియో రికార్డింగ్‌లు

వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్‌లో ఉన్నప్పుడు, మీరు మీ యాక్టివిటీలో భాగంగా Google Search, Assistant, Mapsతో మీ ఇంటరాక్షన్‌ల నుండి ఆడియో రికార్డింగ్‌లను చేర్చవచ్చు. ఆడియో రికార్డింగ్‌ల గురించి తెలుసుకోండి.

ఈ సమాచారాన్ని సేవ్ చేయడం కోసం Googleను అనుమతించడానికి:

  • వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్ అయ్యి ఉండాలి.
  • "వాయిస్, ఆడియో యాక్టివిటీని చేర్చండి" పక్కన ఉన్న బాక్స్‌ను తప్పనిసరిగా ఎంచుకోవాలి.
విజువల్ సెర్చ్ హిస్టరీ

వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్‌లో ఉన్నప్పుడు, మీరు మీ యాక్టివిటీలో భాగంగా సెర్చ్ చేయడానికి ఉపయోగించే ఇమేజ్‌లను చేర్చవచ్చు. మీ విజువల్ సెర్చ్ హిస్టరీ, మీ ఇమేజ్‌లు ఎక్కడ నుండి సేవ్ చేయబడవచ్చు గురించి మరింత తెలుసుకోండి.

ఈ సమాచారాన్ని సేవ్ చేయడం కోసం Googleను అనుమతించడానికి:

  • వెబ్ & యాప్ యాక్టివిటీ ఆన్ అయ్యి ఉండాలి.
  • “విజువల్ సెర్చ్ హిస్టరీని చేర్చండి” పక్కన ఉన్న బాక్స్ తప్పక ఎంచుకోబడాలి.

సేవ్ చేసిన మీ యాక్టివిటీ ఎలా ఉపయోగించబడుతుంది

సేవ్ చేసిన మీ యాక్టివిటీని Google ఎలా ఉపయోగిస్తుంది, దానిని ప్రైవేట్‌గా ఉంచడంలో ఎలా సహాయపడుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

సెర్చ్ క్వెరీలను Google సాధారణంగా ఎలా పరిగణిస్తుందనే దాని గురించి మరింత సమాచారం కోసం గోప్యతా పాలసీ FAQను రివ్యూ చేయండి.

మీరు సైన్ అవుట్ చేసినప్పుడు వెబ్ & యాప్ యాక్టివిటీ ఎలా పనిచేస్తుంది

మీరు సైన్ అవుట్ చేసినప్పటికీ, సెర్చ్ సంబంధిత యాక్టివిటీని ఉపయోగించి మీ సెర్చ్, యాడ్ ఫలితాలను అనుకూలంగా మార్చవచ్చు. ఈ విధమైన సెర్చ్ అనుకూలీకరణను ఆఫ్ చేయడానికి, మీరు సెర్చ్ చేయడాన్ని, బ్రౌజ్ చేయడాన్ని ప్రైవేట్‌గా చేయవచ్చు. అజ్ఞాత మోడ్‌లో బ్రౌజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

బ్రౌజర్ హిస్టరీ

మీ పరికరం మీ యాక్టివిటీని సేవ్ చేయాలా వద్దా అనే దాన్ని కంట్రోల్ చేయడానికి: 

  1. యాక్టివిటీ కంట్రోల్స్ పేజీకి వెళ్లండి.
  2. "Chrome హిస్టరీ, Google సర్వీస్‌లను ఉపయోగించే సైట్‌లకు, యాప్‌లకు, పరికరాలకు సంబంధించిన యాక్టివిటీని చేర్చండి" పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి. 

మీ బ్రౌజర్ మీ సెర్చ్‌లను, మీరు సందర్శించే సైట్‌లను కూడా సేవ్ చేయవచ్చు. కింద పేర్కొన్న వాటిలో మీ హిస్టరీని తొలగించడం ఎలాగో తెలుసుకోండి:

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
1835054195089464911
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false
  翻译: