Jump to content

షెర్లాక్ హోమ్స్

వికీపీడియా నుండి
షెర్లాక్ హోమ్స్
షర్లాక్ హోమ్స్ పాత్ర
సిడ్నీ పేజెట్ ద్వారా షర్లాక్ హోమ్స్ యొక్క కాల్పనిక చిత్రం
మొదటి దర్శనంఒ స్టుడీ ఇన్ స్కార్లెట్
సృష్టికర్తఆర్థర్ కోనన్ డాయిల్
సమాచారం
లింగంపురుషుడు
వృత్తిజాసూసు
కుటుంబంమైక్రోఫ్ట్ హోమ్స్ (సోదరుడు)
జాతీయతబ్రిటన్

షెర్లాక్ హోమ్స్ ప్రముఖ ఆంగ్లేయ రచయిత ఆర్థర్ కోనన్ డోయల్ సృష్టించిన ఒక కల్పిత పాత్ర. డోయల్ రచనల్లో ఈ పాత్ర తనను ఒక కన్సల్టింగ్ డిటెక్టివ్ గా పరిచయం చేసుకుంటుంది. ఈయనకు అద్భుతమైన పరిశీలనా శక్తి, నిగమనం, న్యాయ పరిజ్ఞానం, తార్కిక జ్ఞానం ఉంటాయి. ఈ నైపుణ్యాలతో ఈయన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులతో సహా వేర్వేరు క్లయింట్లకు వివిధ రకాలైన కేసులలో సహాయం చేస్తుంటాడు.

ఈ పాత్ర మొదటిసారిగా 1887 లో ప్రచురితమైన ఎ స్టడీ ఇన్ స్కార్లెట్ రచనలో సృష్టించబడింది. సాహితీ ప్రపంచంలో ఈ పాత్ర మొదటి కల్పిత డిటెక్టివ్ పాత్ర కానప్పటికీ, బాగా ప్రాచుర్యం పొందిన పాత్ర.[1] 1990ల నాటికి, ఈ పాత్ర 25,000 నాటకాల్లోనూ, చలనచిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలు, ప్రచురణల్లో చోటు చేసుకుని చలనచిత్ర, టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా చిత్రీకరించబడిన పాత్రగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.[2]

స్ఫూర్తి

[మార్చు]

ఎడ్గార్ అలన్ పో సృష్టించిన సి. అగస్టే డుపిన్ కాల్పనిక సాహిత్యంలో సృష్టించిన మొదటి డిటెక్టివ్‌ పాత్ర. హోమ్స్‌తో సహా అనేక తరువాతి పాత్రలకు ఈ పాత్ర స్ఫూర్తిగా నిలిచింది.[3] 1877లో కోనన్ డోయల్ కు పరిచయమైన సర్జన్ జోసెఫ్ బెల్ యొక్క నిజ జీవిత వ్యక్తి నుండి హోమ్స్ పాత్రకు స్ఫూర్తి అని చాలాసార్లు చెప్పాడు. హోమ్స్ లాగానే, బెల్ నిశితమైన పరిశీలనల నుండి విస్తృతమైన పరిష్కారాలను కనుగొనడంలో సిద్ధహస్తుడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sutherland, John. "Sherlock Holmes, the world's most famous literary detective". British Library. Archived from the original on 28 జూన్ 2017. Retrieved 3 July 2018.
  2. "Sherlock Holmes awarded title for most portrayed literary human character in film & TV" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Guinness World Records. 14 May 2012. Retrieved 5 January 2020.
  3. Sova, Dawn B. (2001). Edgar Allan Poe: A to Z (Paperback ed.). New York: Checkmark Books. pp. 162–163. ISBN 0-8160-4161-X.
  4. Lycett, Andrew (2007). The Man Who Created Sherlock Holmes: The Life and Times of Sir Arthur Conan Doyle. Free Press. pp. 53–54, 190. ISBN 978-0-7432-7523-1.
  翻译: