కాంతి సంవత్సరం
Appearance
కాంతి సంవత్సరం, అతి పెద్ద దూరాల్ని కొలవడానికి ఉపయోగించే ఒక కొలమానము. దీనిని ప్రత్యేకంగా ఖగోళ శాస్త్రములో ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. కాంతి సుమారుగా ఒక సెకనుకి 3 లక్షల కిలోమీటర్లు వేగంతో ఒక సంవత్సరం పాటు శూన్యంలో ప్రయాణించిన దూరాన్ని ఒక కాంతి సంవత్సరము అని అంటారు. కాంతి వేగము ఒక సెకనుకు 3 లక్షల కిలో మీటర్ల లెక్కన నిముషానికి 180 లక్షల కిలోమీటర్లు, గంటకు 108 కోట్ల కిలో మీటర్ల దూరం, రోజుకు 2592 కోట్ల కిలో మీటర్ల దూరం, సంవత్సరానికి 9 లక్షలా 50 వేల కోట్ల కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
సాంఖ్యక బలము
[మార్చు]ఒక కాంతి సంవత్సరం వీటితో సమానం:
- 9,460,730,472,580.800 కి.మీ. (దాదాపు 9.461 పెటామీటరు)
- 5,878,625,373,183.61 మైళ్ళు
- 63,241 అంతరిక్షమానాలు - Astronomical Units (AU)
- దాదాపు 0.3066 పార్సెక్లు
సంవత్సరమనగా ఒక జూలియన్ సంవత్సరం (గ్రెగోరియన్ సంవత్సరం కాదు), అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య లెక్కల ఆధారంగా ఖచ్చితంగా 365.25 రోజులు (ఖచ్చితంగా, మొత్తం 3,15,57,600 సెకన్లు) .[1]
ఇతర కాంతి సంవత్సరాలు
[మార్చు]సంవత్సరం : విధము | సంవత్సరం (రోజులు) | కాంతి సంవత్సరం (కి.మీ.) | కాంతి సంవత్సరం (మైళ్ళు) |
---|---|---|---|
జూలియన్ సంవత్సరం (IAU) | 365.25 | 9,460,730,472,580,800 | 5,878,625,373,184 |
గ్రెగోరియన్ సంవత్సరం | 365.2425 | 9,460,536,207,068,020 | 5,878,504,662,190 |
1900.0 సగటు అక్షాంశ సంవత్సరం (ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ల ఆధారంగా) |
365.242198781 | 9.460 528 404 88×1015 | 5,878,499,814,135 |
2000.0 సగటు అక్షాంశ సంవత్సరం | 365.242190419[2] | 9.460 528 188 28×1015 | 5,878,499,679,546 |
మూలాలు
[మార్చు]- ↑ "IAU Recommendations concerning Units". Archived from the original on 2007-02-16. Retrieved 2008-03-31.
- ↑ Derived from X. Moisson, "Solar system planetary motion to third order of the masses", Astronomy and astrophysics 341 (1999) 318-327, p. 324 (N for Earth fitted to DE405) and N. Capitaine et al., "Expressions for IAU 2000 precession quantities" PDF (685 KB) Astronomy and Astrophysics 412 (2003) 567-586 p. 581 (P03: pA).