Jump to content

డొమినిక గణతంత్రం

వికీపీడియా నుండి
డొమినిక గణతంత్రం

República Dominicana  (Spanish)
Flag of డొమినిక గణతంత్రం
జండా
Coat of arms of డొమినిక గణతంత్రం
Coat of arms
నినాదం: "Dios, Patria, Libertad" (Spanish)
"దేవుడు, మాతృభూమి, స్వాతంత్ర్యం"
గీతం: ¡Quisqueyanos Valientes!
Valiant Quisqueyans! 
Location of డొమినిక గణతంత్రం
రాజధాని
and largest city
శాంటో డోమింగో
19°00′N 70°40′W / 19.000°N 70.667°W / 19.000; -70.667
అతిపెద్ద నగరంరాజధాని
అధికార భాషలుస్పానిష్
జాతులు
(2022)[1]
  • 73.9% మిశ్రమ
  • 17.8% శ్వేత
  • 7.8% నల్ల
  • 0.5% ఇతరులు
మతం
(2018)[2]
  • 66.7% క్రైస్తవం
  • —44.3% రోమన్ కాథలిక్కులు
  • —21.3% ప్రొటెస్టంట్లు
  • —1.1% ఇతర క్రైస్తవులు
  • 29.6% మతం లేనివారు
  • 0.7% ఇతరులు
  • 2.0% వెల్లడించనివారు
పిలుచువిధండొమినికన్
Quisqueyan (colloquial)[3]
ప్రభుత్వంయూనిటరీ అధ్యక్ష గణతంత్రం[4]
శాసనవ్యవస్థకాంగ్రెస్
• ఎగువ సభ
సెనేట్
• దిగువ సభ
చాంబర్ ఆఫ్ డిప్యూటీస్
ఏర్పాటు
• కెప్టెన్సీ జనరల్ ఆఫ్ శాంటో డోమింగో
1492–1795
• ఫ్రెంచి శాంటో డోమింగో
1795–1809
• మళ్ళీ ఫ్రెంచి వారి శాంటో డోమింగో ఆక్రమణ
1809–1821[5]
• తాత్కాలిక స్వాతంత్ర్యం
1821–1822
• హైతీ ఆక్రమణ కాలం
1822–1844
• తొలి గణతంత్రం
1844–1861[6]
• స్పానిష్ ఆక్రమణ
1861–1865
• రెండవ గణతంత్రం
1865–1916
• అమెరికా ఆక్రమణ
1916–1924
• మూడవ గణతంత్రం
1924–1965[7]
• నాలుగవ గణతంత్రం
1966–ఇప్పటి వరకు
విస్తీర్ణం
• మొత్తం
48,671 కి.మీ2 (18,792 చ. మై.) (128th)
• నీరు (%)
0.7[4]
జనాభా
• 2022 estimate
1,06,94,700[8] (87th)
• 2010 census
9,445,281[9]
• జనసాంద్రత
220/చ.కి. (569.8/చ.మై.) (65th)
GDP (PPP)2022 estimate
• Total
$254.99 billion[10] (65th)
• Per capita
$23,983[10] (90th)
GDP (nominal)2022 estimate
• Total
$109.08 billion[10] (67th)
• Per capita
$10,259 [10] (94th)
జినీ (2020)39.6[11]
medium
హెచ్‌డిఐ (2021)0.767[12]
high · 80th
ద్రవ్యండొమినికన్ పెసో[5] (DOP)
కాల విభాగంUTC  – 4:00[4] (Atlantic Standard Time)
వాహనాలు నడుపు వైపుకుడి
ఫోన్ కోడ్+1-809, +1-829, +1-849
Internet TLD.do[4]
Sources for area, capital, coat of arms, coordinates, flag, language, motto and names: [5]
For an alternate area figure of 48,730 కి.మీ2 (18,810 చ. మై.), calling code 809 and Internet TLD: [4]

డొమినిక గణతంత్రం, లేదా డమినిక గణతంత్రం కరేబియన్ ప్రాంతంలోని గ్రేటర్ ఆంటిల్లెస్ ద్వీపసమూహంలోని హిస్పానియోలా ద్వీపంలో ఉన్న ఒక దేశం. ఇది ఈ ద్వీపాన్ని హైతీతో పంచుకుంటుంది. ద్వీపానికి తూర్పున ఎనిమిదింట ఐదు వంతుల ప్రాంతాన్ని ఆక్రమించింది.[13][14] సెయింట్ మార్టిన్‌ ద్వీపం లాగా రెండు సార్వభౌమ రాజ్యాలు పంచుకున్న రెండు కరేబియన్ దీవులలో హిస్పానియోలా ఒకటి. డొమినిక గణతంత్రం 48,671 square కిలోmeters (18,792 చ. మై.) ) విస్తీర్ణంలో ( క్యూబా తర్వాత) యాంటిలిస్‌లో రెండవ అతిపెద్ద దేశం. దాదాపు 1.07 లక్షల మంది (2022 అంచనా) జనాభాతో ఇది జనాభా ప్రకారం మూడవ అతిపెద్దది. 2020లో 1.08 లక్షల నుండి జనాభా తగ్గింది. జనాభాలో సుమారు 33 లక్షలు రాజధాని నగరం శాంటో డొమింగో మెట్రోపాలిటన్ ప్రాంతంలో నివసిస్తున్నారు.[4][15][16] దేశ అధికారిక భాష స్పానిష్.

డొమినిక గణతంత్రం, కరేబియన్‌లో పర్యాటకులు అత్యధికంగా సందర్శించే గమ్యస్థానం. ఏడాది పొడవునా ఆడగలిగే గోల్ఫ్ కోర్సులు ఇక్కడి ప్రధాన ఆకర్షణ.[17] ఇది భౌగోళికంగా విభిన్నమైన దేశం. కరేబియన్ యొక్క ఎత్తైన పర్వత శిఖరం పికో డ్వార్టే, డొమినిక గణతంత్రం‌లో ఉంది. కరేబియన్ లోని అతిపెద్ద సరస్సు లేక్ ఎన్రిక్విల్లో ఇక్కడే ఉంది. సగటు ఉష్ణోగ్రత 26 °C (78.8 °F)తో ద్వీపంలో గొప్ప వాతావరణ, జీవ వైవిధ్యం ఉంది.[17] శాంటో డొమింగోలోని కలోనియల్ జోన్‌ ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇక్కడ ఉన్న కేథడ్రల్, కోట, కోట మఠం అమెరికాలలోనే మొట్టమొదటివి.[18][19] బేస్‌బాల్ ఇక్కడి జాతీయ క్రీడ.

చరిత్ర

[మార్చు]

యూరోపియన్ల రాకకు ముందు హిస్పానియోలాలో స్థానిక టైనో ప్రజలు నివసించేవారు. దీనిని ఐదు ప్రధాన రాజ్యాలుగా విభజించారు.[4] వారు ఒక అధునాతన వ్యావసాయిక, వేట సమాజాన్ని నిర్మించారు. వ్యవస్థీకృత నాగరికతగా మారే ప్రక్రియలో ఉన్నారు. టైనోలు క్యూబా, జమైకా, ప్యూర్టో రికో, బహామాస్‌లలో కూడా నివసించేవారు. జెనోయిస్ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ 1492 [4] తన మొదటి సముద్రయానంలో ఈ ద్వీపాన్ని కనుక్కుని, దీన్ని కాస్టిలే అని అనుకున్నాడు. శాంటో డొమింగో కాలనీ అమెరికాలో మొట్టమొదటి శాశ్వత యూరోపియన్ స్థావరం. కొత్త ప్రపంచంలో స్పానిష్ వలస పాలన యొక్క మొదటి స్థానంగా మారింది. బానిసలుగా ఉన్న ఆఫ్రికన్ల దిగుమతిని అమెరికాలకు పరిచయం చేసిన ప్రదేశం కూడా ఇదే. 16వ, 17వ శతాబ్దాల్లో టైనో ప్రతిఘటనలు, మొదటి బానిస తిరుగుబాట్లు, మొదటి మెరూన్ కార్యకలాపాలు, ఆర్థిక పతనాలు, కష్టాల శతాబ్దం, విపత్తు సంఘటనలు, ఆంగ్లేయుల దండయాత్రలు, ఫ్రెంచివారి ఘర్షణలు జరిగాయి. ఇవి 17వ శతాబ్దం చివరి వరకు జరిగాయి. 1697లో స్పెయిన్, ఈ ద్వీపపు పశ్చిమాన మూడవ వంతు భాగంలో ఫ్రెంచివారి ఆధిపత్యాన్ని గుర్తించింది. ఈ భాగ1804 మేలో [4] హైతీ దేశంగా మారింది.

మూడు వందల సంవత్సరాలకు పైగా స్పానిష్ పాలన తర్వాత, డొమినికన్ ప్రజలు 1821 నవంబరులో [4] స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, జోస్ న్యూనెజ్ డి కాసెరెస్, డొమినికన్ దేశాన్ని గ్రాన్ కొలంబియా దేశంతో ఏకం చేయాలని ఉద్దేశించాడు. అయితే కొత్తగా స్వతంత్రంగా వచ్చిన డొమినికన్లను 1822 ఫిబ్రవరిలో హైతీ బలవంతంగా విలీనం చేసుకుంది. 22 సంవత్సరాల డొమినికన్ స్వాతంత్ర్య యుద్ధం తర్వాత, 1844లో స్వాతంత్ర్యం వచ్చింది.[4] తరువాతి 72 సంవత్సరాలలో, డొమినిక గణతంత్రం చాలావరకు అంతర్యుద్ధాలను ఎదుర్కొంది. పొరుగున ఉన్న హైతీ నుండి అనేక దండయాత్రలను ఎదుర్కొంది. 1863–1865 లో జరిగిన డొమినికన్ పునరుద్ధరణ యుద్ధంలో స్పానిష్‌ వారిని శాశ్వతంగా వెళ్ళగొట్టే వరకు కొన్నాళ్ళ పాటు స్పానిష్ వలసరాజ్యంగా ఉంది.[20][21][22] ఈ కాలంలో, ముగ్గురు అధ్యక్షులు హత్య చేయబడ్డారు (1864లో జోస్ ఆంటోనియో సాల్సెడో, 1899లో యులిసెస్ హ్యూరేక్స్, 1911లో రామోన్ కాసెరెస్ ).

విదేశీ రుణాల ఎగవేత భయాల కారణంగా అమెరికా, డొమినిక గణతంత్రం‌ను ఆక్రమించింది (1916-1924). ఆ తర్వాత హొరాసియో వాస్క్వెజ్ ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాల పాటు ప్రశాంతమైన, సంపన్నమైన పాలన సాగింది. 1930 నుండి 1961 వరకు రాఫెల్ లియోనిడాస్ ట్రుజిల్లో నియంతృత్వ పలన సాగింది.[4] జువాన్ బాష్ 1962లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ 1963లో సైనిక తిరుగుబాటులో పదవీచ్యుతుడయ్యాడు. 1965లో జరిగిన అంతర్యుద్ధం, దేశంలో చివరి అంతర్యుద్ధం, అమెరికా సైనిక జోక్యంతో అది ముగిసింది. ఆ తరుబ్వాత జోక్విన్ బాలగుర్ (1966-1978, 1986-1996) నిరంకుశ పాలన సాగింది. 1978 నుండి, డొమినిక గణతంత్రం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం వైపు మళ్లింది.[23] 1996 తర్వాత ఎక్కువ సమయం లియోనెల్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో ఉంది. 2012లో ఫెర్నాండెజ్ తర్వాత, డానిలో మదీనా 51% ఓట్లను గెలుచుకున్నారు.[24] ఆ సంవత్సరం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగడంతో 2020 అధ్యక్ష ఎన్నికలలో అతని తర్వాత లూయిస్ అబినాదర్ ఎన్నికయ్యాడు.

భౌగోళికం

[మార్చు]
డొమినిక గణతంత్రం యొక్క టోపోగ్రాఫికల్ మ్యాప్

డొమినిక గణతంత్రం హిస్పానియోలా ప్రాంతంలో తూర్పు భాగంలో ఎనిమిదింట ఐదు వంతుల భూమి కలిగి ఉంది. ఇది గ్రేటర్ ఆంటిల్లెస్‌లోని రెండవ అతిపెద్ద ద్వీపం. దీనికి ఉత్తరాన అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణాన కరేబియన్ సముద్రం ఉన్నాయి. ఇది హైతీతో 2:1 నిష్పత్తిలో ద్వీపాన్ని పంచుకుంటుంది. ఉత్తరం నుండి దక్షిణానికి రెండు దేశాల మధ్య సరిహద్దు పొడవు 376 కి.మీ. (234 మై.).[4] ఉత్తరం, వాయవ్య దిశల్లో బహామాస్, టర్క్స్ అండ్ కైకోస్ దీవులు, తూర్పున, మోనా పాసేజ్, ప్యూర్టో రికో ఉన్నాయి. దేశం వైశాల్యం 48,442 చ.కి.మీ. అని 48,670 చ.కి.మీ. అనీ వివిధ లెక్కలు ఉన్నాయి.[4] ఇది యాంటిలిస్‌లో క్యూబా తర్వాత రెండవ అతిపెద్ద దేశం. డొమినిక గణతంత్రం రాజధాని, అతిపెద్ద నగరం శాంటో డొమింగో దేశానికి దక్షిణ తీరంలో ఉంది.[4]

డొమినిక గణతంత్రం‌లో నాలుగు ముఖ్యమైన పర్వత శ్రేణులున్నాయి. ఉత్తర కొసన కార్డిల్లెరా సెప్టెంట్రియోనల్ ఉంది. ఇవి హైతీ సరిహద్దుకు దగ్గరగా ఉన్న, వాయవ్య తీర పట్టణం మోంటే క్రిస్టీ నుండి తూర్పున సమనా ద్వీపకల్పం వరకు విస్తరించి, అట్లాంటిక్ తీరానికి సమాంతరంగా నడుస్తాయి. డొమినిక గణతంత్రం‌లో అత్యంత ఎత్తైన శ్రేణి - నిజానికి, మొత్తం వెస్టిండీస్‌లోనే ఎత్తైనవి– కార్డిల్లెరా సెంట్రల్. ఇది దక్షిణం వైపు వంగి కరేబియన్ తీరంలో అజువా పట్టణానికి సమీపంలో ముగుస్తుంది. కార్డిల్లెరా సెంట్రల్‌లో కరేబియన్‌లోని నాలుగు ఎత్తైన శిఖరాలు ఉన్నాయి: పికో డ్యూర్టే (సముద్ర మట్టానికి 3,098 మీటర్లు or 10,164 అడుగులు),[4] లా పెలోనా (3,094 మీటర్లు or 10,151 అడుగులు), లా రుసిల్లా (3,049 మీటర్లు or 10,003 అడుగులు), పికో యాక్ (2,760 మీటర్లు or 9,055 అడుగులు). దేశంలోని నైరుతి మూలలో, కార్డిల్లెరా సెంట్రల్‌కు దక్షిణంగా, మరో రెండు శ్రేణులు ఉన్నాయి: ఈ రెండిటిలో ఉత్తరాన ఉన్నది సియెర్రా డి నీబా కాగా, దక్షిణాన సియెర్రా డి బహోరుకో.

శీతోష్ణస్థితి

[మార్చు]
డొమినిక గణతంత్రం యొక్క కొప్పెన్ వాతావరణ రకాలు

డొమినిక గణతంత్రం తీరప్రాంతంలో, లోతట్టు ప్రాంతాలలో ఉష్ణమండల వర్షారణ్య శీతోష్ణస్థితి ఉంటుంది. చాలా సిబావో ప్రాంతం వంటి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణమండల సవన్నా శీతోష్ణస్థితి ఉంటుంది.[25] వైవిధ్యభరితమైన స్థలాకృతి కారణంగా, డొమినిక గణతంత్రం శీతోష్ణస్థితిలో తక్కువ దూరాలకే గణనీయమైన వైవిధ్యం ఉంటుంది. యాంటిల్లెస్‌ అంతటి లోకీ ఇక్కడ అత్యధిక వైవిధ్యం ఉంటుంది. వార్షిక సగటు ఉష్ణోగ్రత 25 °C (77 °F) అధిక ఎత్తులో ఉష్ణోగ్రత సగటు 18 °C (64.4 °F) సముద్ర మట్టానికి సమీపంలో ఉన్నప్పుడు సగటు ఉష్ణోగ్రత 28 °C (82.4 °F) తక్కువ ఉష్ణోగ్రతలు 0 °C (32 °F) పర్వతాలలో సాధ్యమే. అయితే అధిక ఉష్ణోగ్రతలు 40 °C (104 °F) రక్షిత లోయలలో సాధ్యమవుతుంది. జనవరి, ఫిబ్రవరిలు అత్యంత శీతలంగా ఉండే నెలలు కాగా, ఆగస్టు అత్యంత వేడిగా ఉండే నెల. పికో డ్వార్టే శిఖరంపై కొన్నిసార్లు మంచు కురుస్తుంది.[26]

ఉత్తర తీరంలో వర్షా కాలం నవంబరు నుండి జనవరి వరకు ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో మే నుండి నవంబరు వరకు ఉంటుంది. మే అత్యంత తేమతో కూడిన నెల .దేశవ్యాప్తంగా, సగటు వార్షిక వర్షపాతం 1,500 మిల్లీమీటర్లు (59.1 అం.). వాళ్ళే డి నైబాలోని కొన్ని ప్రదేశాల్లో సగటున 350 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. కార్డిల్లెరా ఓరియంటల్ సగటున 2,740 మి.మీ. ఉంటుంది. దేశంలోని అత్యంత పొడి ప్రాంతం పశ్చిమాన ఉంది.[26]

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఉష్ణమండల తుఫానులు డొమినిక గణతంత్రం‌ను తాకుతాయి. వీటి ప్రభావం 65% దక్షిణ తీరం వెంబడి ఉంటుంది. హరికేన్లు జూన్, అక్టోబరుల మధ్య ఎక్కువగా ఉంటాయి.[4][26] 1998లో వచ్చిన హరికేన్ జార్జెస్ దేశాన్ని తాకిన చివరి పెద్ద హరికేన్.

పరిపాలనా విభాగాలు

[మార్చు]
డొమినిక గణతంత్రం యొక్క ప్రావిన్సులు

డొమినిక గణతంత్రం 31 ప్రావిన్సులుగా విభజించబడింది. శాంటో డొమింగో, రాజధాని, డిస్ట్రిటో నేషనల్ (జాతీయ జిల్లా) గా నియమించబడింది. ప్రావిన్స్‌లు మునిసిపాలిటీలుగా విభజించబడ్డాయి. అవి దేశంలోని రెండవ-స్థాయి రాజకీయ, పరిపాలనా ఉపవిభాగాలు . రాష్ట్రపతి 31 ప్రావిన్సులకు గవర్నర్‌లను నియమిస్తారు. మేయర్లు మునిసిపల్ కౌన్సిల్‌లు 124 మునిసిపల్ జిల్లాలను, నేషనల్ డిస్ట్రిక్ట్ (శాంటో డొమింగో)ను నిర్వహిస్తాయి. అదే సమయంలో వారు కాంగ్రెస్ ప్రతినిధులుగా కూడా ఎన్నికౌతారు.[27]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
డొమినిక గణతంత్రం, హైతీల్లో చారిత్రక GDP తలసరి అభివృద్ధి

కరేబియన్, సెంట్రల్ అమెరికన్ ప్రాంతంలో డొమినిక గణతంత్రం‌దే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. లాటిన్ అమెరికాలో ఇది ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.[28][29] గత 25 సంవత్సరాలుగా, డొమినిక గణతంత్రం పశ్చిమ అర్ధగోళంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ - 1992, 2018 మధ్య సగటు వాస్తవ GDP వృద్ధి రేటు 5.3%.[30] 2014, 2015లో GDP వృద్ధి వరుసగా 7.3, 7.0%కి చేరుకుంది, ఇది పశ్చిమ అర్ధగోళంలో అత్యధికం.[30] 2016 మొదటి అర్ధభాగంలో, డొమినికన్ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ధిని సాధించి, వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించింది.[31] నిర్మాణం, తయారీ, పర్యాటకం, మైనింగ్ రంగాలు ఈ వృద్ధికి ఎక్కువగా దోహదపడ్డాయి. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద బంగారు గని, ప్యూబ్లో వీజో గని ఈ దేశంలో ఉంది.[32][33] తక్కువ ద్రవ్యోల్బణం (2015లో సగటున 1% కంటే తక్కువ), ఉద్యోగ కల్పన, అధిక స్థాయి చెల్లింపుల కారణంగా ప్రైవేట్ వినియోగం బలంగా ఉంది. ఆదాయ అసమానత, తరతరాలుగా పరిష్కరించబడని సమస్య. వేగవంతమైన ఆర్థిక వృద్ధి కారణంగా ఇప్పుడు డొమినిక గణతంత్రం గిని గుణకం ఇజ్రాయెల్, ఉరుగ్వేల మాదిరిగానే 39 గా ఉంది. యునైటెడ్ స్టేట్స్, కోస్టా రికా లేదా చిలీ వంటి దేశాల కంటే ఇది మెరుగు. డొమినిక గణతంత్రం‌లో చట్టవిరుద్ధమైన హైతీవాసుల వలసలు పెద్ద సమస్య. దీనివలన డొమినికన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి వచ్చి డొమినికన్‌లు, హైతియన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.[34][35][36][37][38] వెనిజులా నుండి వచ్చిన 1,14,050 అక్రమ వలసదారులకు కూడా డొమినిక గణతంత్రం నిలయం.[4]

వ్యవసాయ వస్తువుల (ప్రధానంగా చక్కెర, కోకో, కాఫీ) ఎగుమతులపై ఆధారపడిన డొమినికన్ ఆర్థిక వ్యవస్థ, గత మూడు దశాబ్దాలలో సేవలు, తయారీ, వ్యవసాయం, మైనింగ్ రంగాల విభిన్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పరివర్తన చెందింది. సేవా రంగానికి GDPలో దాదాపు 60% వాటా ఉంది; తయారీ, 22% ; పర్యాటకం, టెలికమ్యూనికేషన్స్, ఫైనాన్స్ సేవా రంగంలో ప్రధాన భాగాలు; అయినప్పటికీ, వాటిలో ఏదీ మొత్తం 10% కంటే ఎక్కువ కాదు.[39] డొమినిక గణతంత్రం‌లో బోల్సా డి వాలోర్స్ డి లా రిపబ్లికా డొమినికానా (BVRD) పేరుతో స్టాక్ మార్కెట్‌ ఉంది, .[40] అధునాతన సమాచార, రవాణా వ్యవస్థలున్నాయి.[17] అధిక నిరుద్యోగం, ఆదాయ అసమానతలు దేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాళ్లు.[4] అంతర్జాతీయ వలసలు డొమినిక గణతంత్రం‌ను బాగా ప్రభావితం చేస్తున్నాయి. హైతీ నుండి భారీగా జరిగే అక్రమ వలసలు, హైతీ సంతతికి చెందిన డొమినికన్ల ఏకీకరణ ప్రధాన సమస్యలు.[41] అమెరికాలో పెద్ద డొమినికన్ డయాస్పోరా ఉంది.[42] వీరు డొమినికన్ కుటుంబాలకు డబ్బుల రూపంలో బిలియన్ల డాలర్లను పంపుతూ దేశాభివృద్ధికి దోహదపడుతున్నారు.[4][27]

మారకం

[మార్చు]

డొమినికన్ పెసో [43] జాతీయ ద్రవ్య మారకం. యునైటెడ్ స్టేట్స్ డాలర్, యూరో, కెనడియన్ డాలర్, స్విస్ ఫ్రాంక్‌లు కూడా చాలా పర్యాటక ప్రదేశాలలో చెల్లుతాయి. US డాలర్‌కి మారకం రేటు, 1985 నాటికి సరళీకరించబడింది, 1986 ఆగస్టులో డాలర్‌కు 2.70 పెసోలు,[44]: p417, 428 1993లో 14.00 పెసోలు, 2000లో 16.00 పెసోలు. 2018 సెప్టెంబరు నాటికి డాలర్‌కు 50.08 పెసోలు.[45]

పర్యాటకం

[మార్చు]

డొమినిక గణతంత్రం ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రంగాల్లో పర్యాటకం ఒకటి. డొమినిక గణతంత్రం కరేబియన్‌లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. క్యాప్ కానా, శాంటో డొమింగోలోని శాన్ సౌసీ పోర్ట్, కాసా డి కాంపో, పుంటా కానాలోని హార్డ్ రాక్ హోటల్ & క్యాసినో (పురాతన మూన్ ప్యాలెస్ రిసార్ట్) వంటి ప్రాజెక్టుల నిర్మాణంతో, డొమినిక గణతంత్రం రాబోయే సంవత్సరాల్లో పర్యాటక కార్యకలాపాలను పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

జరాబాకోవా, కాన్‌స్టాంజా వంటి పట్టణాలు, పికో డ్వార్టే, బహియా డి లాస్ అగ్యిలాస్ తదితర ప్రాంతాలు పర్యాటకం నుండి ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలలో మరింత ముఖ్యమైనవిగా మారడంతో పర్యావరణ పర్యాటకం కూడా ఈ దేశంలో చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులు వారి స్వదేశాన్ని బట్టి టూరిస్ట్ కార్డ్‌ని పొందవలసి ఉంటుంది. గత 10 సంవత్సరాలలో డొమినిక గణతంత్రం రీసైక్లింగ్, వ్యర్థాలను పారవేసే విషయంలో ప్రపంచంలోని ప్రగతిశీల దేశాలలో ఒకటిగా మారింది. ఉత్తరాన ఉన్న అతిపెద్ద ఓపెన్ ఎయిర్ ల్యాండ్‌ఫిల్ సైట్‌ వల్ల, గత 10 సంవత్సరాల్లో 221.3% సామర్థ్యం పెరుగుదల ఉందని UN నివేదిక పేర్కొంది.

రవాణా

[మార్చు]

దేశంలో మూడు జాతీయ ట్రంక్ రోడ్లు ఉన్నాయి, ఇవి ప్రతి ప్రధాన పట్టణాన్ని కలుపుతాయి. ఇవి DR-1, DR-2, DR-3, ఇవి శాంటో డొమింగో నుండి వరుసగా దేశంలోని ఉత్తర (సిబావో), నైరుతి (సుర్), తూర్పు (ఎల్ ఎస్టే) ప్రాంతాలకు బయలుదేరుతాయి. అనేక విభాగాల విస్తరణ, పునర్నిర్మాణంతో ఈ హైవేలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తారు. మరో రెండు జాతీయ రహదారులు స్పర్ ( DR-5 ) లేదా ప్రత్యామ్నాయ మార్గాలు ( DR-4 )గా పనిచేస్తాయి.

జనాభా వివరాలు

[మార్చు]
2020లో జనాభా పిరమిడ్

2016లో డొమినిక గణతంత్రం జనాభా 10,648,791 . [46] 2010లో, జనాభాలో 31.2% మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. జనాభాలో 6% మంది 65 ఏళ్లు పైబడిన వారు.[47] 2020లో ప్రతి 100 మంది స్త్రీలకు 102.3 మంది పురుషులు ఉన్నట్లు అంచనా [4] 2006–2007 వార్షిక జనాభా వృద్ధి రేటు 1.5%, 2015 సంవత్సరానికి అంచనా వేసిన జనాభా 10,121,000.[48]

2007లో జనసాంద్రత చ.కి.మీ. 192. 63% జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.[49] దక్షిణ తీర మైదానాలు, సిబావో లోయ దేశంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలు. రాజధాని నగరం శాంటో డొమింగో జనాభా 2010లో 2,907,100 [50]

ఇతర ముఖ్యమైన నగరాలు శాంటియాగో డి లాస్ కాబల్లెరోస్ ( pop. 745,293), లా రోమనా (జనాభా 214,109), శాన్ పెడ్రో డి మాకోరిస్ (జనాభా 185,255), హిగ్యుయ్ (153,174), శాన్ ఫ్రాన్సిస్కో డి మాకోరిస్ (జనాభా 745,132 ), ప్యూర్టో ప్లాటా (జనాభా 118,282), లా వేగా (జనాభా 104,536). ఐక్యరాజ్యసమితి ప్రకారం, 2000-2005కి పట్టణ జనాభా వృద్ధి రేటు 2.3%.[50]

2014 నాటికి, జనాభాలో 57% (57 లక్షలు) రోమన్ కాథలిక్కులు, 23% (23 లక్షలు) మంది ప్రొటెస్టంట్లు. 1896 నుండి 1907 వరకు ఎపిస్కోపల్, ఫ్రీ మెథడిస్ట్, సెవెంత్-డే అడ్వెంటిస్ట్, మొరావియన్ చర్చిల నుండి మిషనరీలు డొమినిక గణతంత్రం‌లో పని చేయడం ప్రారంభించారు. డొమినిక గణతంత్రం జనాభాలో 1.063 కోట్ల మంది (జనాభాలో 3%) సెవెంత్-డే అడ్వెంటిస్టులు. ఇటీవలి వలసలు, మతమార్పిడి ప్రయత్నాల కారణంగా ఇతర మత సమూహాలు వచ్చాయి. జనాభాలో వారి వాటా ఇలా ఉంది: స్పిరిటిస్ట్: 2.2%, ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్: 1.3%, బౌద్ధులు: 0.1%, బహాయి: 0.1%, చైనీస్ జానపద మతం: 0.1%, ఇస్లాం: 0.02%, జుడాయిజం: 0.01%.

మూలాలు

[మార్చు]
  1. Breve Encuesta Nacional de Autopercepción Racial y Étnica en la República Dominicana. Santo Domingo: Oficina Nacional de Estadística de la República Dominicana. 2022.
  2. "Dominican Republic". The World Factbook. Central Intelligence Agency. Retrieved January 22, 2021.
  3. Roorda, Eric Paul (April 28, 2016). Historical Dictionary of the Dominican Republic. Rowman & Littlefield. ISBN 9780810879065 – via Google Books.
  4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 4.12 4.13 4.14 4.15 4.16 4.17 4.18 4.19 4.20 "Central America :: Dominican Republic". CIA World Factbook. Central Intelligence Agency. Retrieved February 19, 2020.
  5. 5.0 5.1 5.2 "Embassy of the Dominican Republic, in the United States". Archived from the original on June 26, 2015. Retrieved February 27, 2009.
  6. Historia de la República Dominicana. Ediciones Doce Calles, S.L. 2010. p. 409. ISBN 978-84-00-09240-5. Retrieved July 1, 2013.
  7. "12 de julio de 1924, una fecha relegada al olvido". Diario Libre. August 18, 2012. Retrieved September 24, 2014.
  8. {{{2}}} entry at The World Factbook
  9. "Población – IX Censo Nacional de Población y Vivienda 2010". Oficina Nacional de Estadística (ONE). Archived from the original on October 12, 2006. Retrieved June 20, 2020.
  10. 10.0 10.1 10.2 10.3 International Monetary Fund. "Gross domestic product based on purchasing-power-parity (PPP) valuation of country GDP". Retrieved May 3, 2022.
  11. "GINI index (World Bank estimate) – Dominican Republic". World Bank. Retrieved May 30, 2022.
  12. "Human Development Report 2021/2022" (PDF) (in ఇంగ్లీష్). United Nations Development Programme. 8 September 2022. Retrieved 8 September 2022.
  13. Vascular Surgery: A Global Perspective.
  14. Josh, Jagran, ed. (2016). "Current Affairs November 2016 eBook". p. 93.
  15. "Dominican Republic | Data". data.worldbank.org. Retrieved April 28, 2016.
  16. "Estimaciones y Proyecciones de la Población Dominicana por Regiones, Provincias, Municipios y Distritos Municipales, 2008". Archived from the original on May 11, 2011. Retrieved December 25, 2008.
  17. 17.0 17.1 17.2 "Consulate-General of the Dominican Republic Bangkok Thailand". Retrieved February 27, 2009.
  18. "Colonial City of Santo Domingo". UNESCO World Heritage Centre. Retrieved August 24, 2016.
  19. UNESCO around the World | República Dominicana.
  20. Franco, César A. "La guerra de la Restauración Dominicana, el 16 de agosto de 1863" [The Dominican Restoration War, 16 August 1863] (PDF) (in స్పానిష్). dgii.gov.do. Archived from the original (PDF) on June 24, 2015.
  21. Guerrero, Johnny (August 16, 2011). "La Restauración de la República como referente histórico" [The Restoration of the Republic as an historical reference] (in స్పానిష్). El Día. Retrieved August 23, 2016.
  22. Sagas, Ernesto. "An Apparent Contradiction? Popular Perceptions of Haiti and the Foreign Policy of the Dominican Republic". Lehman College (Presented at the Sixth Annual Conference of the Haitian Studies Association, Boston, MA). Retrieved December 30, 2014.
  23. "Antonio Guzmán | Ministerio Administrativo de la Presidencia". mapre.gob.do. Archived from the original on September 25, 2020. Retrieved August 4, 2020.
  24. Fox, Ben; Ezequiel Abiu Lopez (May 20, 2012). "Dominican Republic Elections: Ex-President Hipolito Mejia Challenges Danilo Medina". Huffington Post. Archived from the original on January 31, 2016.
  25. Isso, Michela; Aucelli, Pietro; Maratea, Antonio; Rosskopf, Carmen; Mendez-Tejada, Rafael; Pérez, Carlos; Segura, Hugo (September 2010). "A New Climatic Map of the Dominican Republic Based on the Thornthwaite Classification". Physical Geography. 31 (5): 455–472. doi:10.2747/0272-3646.31.5.455. S2CID 129484907.
  26. 26.0 26.1 26.2 United States Library of Congress (May 24, 2007). "Dominican Republic – Climate". Country Studies US. Retrieved October 27, 2009.
  27. 27.0 27.1 "U.S. Relations With the Dominican Republic". United States Department of State. October 22, 2012.
  28. "CIA – The World Factbook – Rank Order – GDP (purchasing power parity)". Archived from the original on June 4, 2011. Retrieved February 27, 2009.
  29. "Dominican Republic". World Bank. Retrieved April 28, 2016.
  30. 30.0 30.1 "Dominican Republic Overview". World Bank. Retrieved April 29, 2016.
  31. "Dominican economy grows 7.4% in first half, paced by construction". Dominican Today. Archived from the original on August 26, 2016. Retrieved August 27, 2016.
  32. "World's 10 Largest Gold Mines by Production | INN". July 31, 2019.
  33. "World Top 20 Gold: Countries, Companies and Mines". Archived from the original on September 26, 2017. Retrieved September 27, 2017.
  34. "Illegal Haitian Workers in Demand". cronkite.asu.edu.
  35. United Nations High Commissioner for Refugees. "Refworld | "Illegal People": Haitians And Dominico-Haitians In The Dominican Republic". Refworld.
  36. "Immigration repatriates 200,000 illegal Haitians in 2 months". dominicantoday.com. March 8, 2021.
  37. "New Dominican law seeks to prevent illegal Haitians from renting a place to live". News From Haiti.
  38. "Dominican Republic denies birthright citizenship to children of illegal immigrants". The World from PRX.
  39. "Sector Real". Central Bank of the Dominican Republic (Banco Central de la República Dominicana). Archived from the original on April 16, 2016. Retrieved April 29, 2016.
  40. "¿Quiénes Somos?". Bolsa de Valores de la República Dominicana. Retrieved March 3, 2016.
  41. Diógenes Pina (March 21, 2007). "Dominican Republic: Deport Thy (Darker-Skinned) Neighbour". Inter Press Service (IPS). Archived from the original on January 9, 2008. Retrieved January 14, 2008.
  42. "United States – Selected Population Profile in the United States (Dominican (Dominican Republic))". 2008 American Community Survey 1-Year Estimates. U.S. Census Bureau. Archived from the original on February 12, 2020. Retrieved January 10, 2010.
  43. "(DOP/USD) Dominican Republic Pesos to United States Dollars Rate". XE.com. Retrieved November 28, 2010.
  44. Pons, Frank (1995). The Dominican Republic, A National History. New Rochelle: Hispaniola Books. pp. 33–37. ISBN 978-1885509017.
  45. "XE: Convert USD/DOP. United States Dollar to Dominican Republic Peso". Retrieved September 14, 2019.
  46. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  47. "World Population Prospects: The 2012 Revision" (PDF). United Nations Department of Economic and Social Affairs. 2013. p. 254. Archived from the original (PDF) on November 5, 2016. Retrieved August 24, 2016.
  48. "World Population Prospects: The 2006 Revision, Highlights, Working Paper No. ESA/P/WP.202" (PDF). United Nations, Department of Economic and Social Affairs, Population Division. 2007. Retrieved January 13, 2008.
  49. "Población en Tiempo Real" (in స్పానిష్). Consejo Nacional de Población y Familia. Archived from the original on August 8, 2011. Retrieved January 13, 2008.
  50. 50.0 50.1 Dominican Republic – Population.
  翻译: